విపత్తు నిర్వహణపై ఆసిఫాబాద్ కలెక్టర్, ఎస్పీ ముందస్తు సమీక్ష!

0
0

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు రియు జిల్లా ఎస్పీ నితికా పంత్ IPS గారి  నేతృత్వంలో రాబోయే వర్షాకాలాన్ని పురస్కరించుకుని భారీ వర్షాలు, వరదలు మరియు ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విపత్తు నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ప్రభుత్వ శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని.

క్షేత్రస్థాయిలో కంట్రోల్ రూమ్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున విపత్తుల సమయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందాలను అవసరమైన లైఫ్ జాకెట్లు, బోట్లు, ఇతర రక్షణ సామాగ్రితో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల (ఇరిగేషన్), పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, రహదారులు మరియు భవనాల (R&B), విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL), అగ్నిమాపక, మరియు సమాచార పౌర సంబంధాల శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు మరియు ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సమన్వయంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.