ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్: జూలై నుండి ప్రక్రియ?
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
జూలై నుండి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అధికార కూటమి ప్రభుత్వం ఈ నెలలోనే ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’, ‘మత్స్యకారుల భరోసా’ వంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. వీటితో పాటు కొత్త పింఛన్ల మంజూరు ద్వారా ప్రజల్లో గరిష్ట సంతృప్తిని పెంపొందించి, పూర్తి సానుకూలతతో ఎన్నికల బరిలోకి వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.










