ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు… రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.

0
0

రష్యా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్.. అణుశక్తి దిగ్గజం ‘రోసాటమ్’, అల్యూమినియం తయారీ సంస్థ ‘రుసాల్’ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక వాడలకు నిరంతరాయ విద్యుత్ కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (SMR), న్యూక్లియర్ డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదనలు చేయగా, ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది.

అలాగే రుసాల్ సంస్థను గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం గ్లోబల్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొన్న ఆయన, ఆర్కిటిక్ ఉత్తర సముద్ర మార్గం ద్వారా ఏపీకి కలగనున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలను, కొత్త ఓడరేవుల అవకాశాలను ప్రపంచ దేశాలకు వివరించా