అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు శుక్రవారం మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ చెక్కులు అందజేశారు. మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు సిడబ్ల్యూఎఫ్ నిధుల నుండి రూ. 15 వేలు, రూ. 20 వేల చెక్కులను పంపిణీ చేశారు.
ఇటీవల రిటైరైన హోంగార్డు శ్రీనివాసులుకు తోటి సిబ్బంది సేకరించిన ఒకరోజు వేతనం రూ. 2, 23, 650 చెక్కును ఎస్పీ అందజేసి హోంగార్డుల ఉదారతను అభినందించారు








