రైళ్లలో పిల్లల ప్రయాణం: టికెట్ నిబంధనలపై అవగాహన అవసరం
రైళ్లలో ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన ఉండటం ఎంతో అవసరం. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి టికెట్ అవసరం లేదు, వారు ఉచితంగా ప్రయాణించవచ్చు.
అయితే వారికి ప్రత్యేక బెర్త్ కేటాయించబడదు. అలాగే 5 నుండి 12 ఏళ్ల వయస్సు గల పిల్లలకు సగం టికెట్ ధర వర్తిస్తుంది. కానీ, వారికి ప్రత్యేక సీటు లేదా బెర్త్ కావాలనుకుంటే పూర్తి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
12 ఏళ్లు దాటిన వారికి పూర్తి టికెట్ తప్పనిసరి. ఆన్లైన్ బుకింగ్‌లో వయస్సు తప్పుగా నమోదు చేస్తే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో పిల్లల ఆధార్ లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం వెంట ఉంచుకోవడం మంచిది.










