ఆదివారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి. ఆర్ రాసాని, ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అమరావతిలో రూ. 137 కోట్లతో అతిపెద్ద గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గ్రంథాలయాల ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మంత్రి లోకేష్ సిబ్బంది వేతనాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించి గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దృఢనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు.










