జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.

0
2

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న రాయలసీమ జోనల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యుగంధర్ సోమవారం పిలుపునిచ్చారు.

మతం మారిన కారణంతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు నిరాకరించడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారికి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభకు జిల్లా నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.