అన్నమయ్య: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్.

0
4

మదనపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం ‘యోగాంధ్ర-2026’ సామూహిక యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ కల్యాణి ప్రారంభించారు.

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జూన్ 11న హార్స్ లీహిల్స్, 14న బోయకొండలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు, అంగన్‌వాడీలు, ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు.