కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.

0
2

మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మదనపల్లె మండలంలో రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్‌కు సూచనలు చేశారు.