నకిలీ క్రీడా సంఘాలు – టోర్నమెంట్లపై నాయకులకు అవగాహన పెంచుకోవాలి

0
4

మంచిర్యాల : రాష్ట్రంలో మరియు జిల్లాల్లో కొన్ని నకిలీ క్రీడా సంఘాలు అధికారిక గుర్తింపు లేకుండానే టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడల అభివృద్ధి పేరుతో నిర్వహించే ప్రతి పోటీకి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ క్రీడా సమాఖ్యల అనుమతి ఉంటుందని భావించడం సరైనది కాదని క్రీడా నిపుణులు చెబుతున్నారు,చాలా సందర్భాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి సమాచారం లేకుండా ఇలాంటి టోర్నమెంట్లకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీంతో ఆ సంఘాలకు ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుండగా.

అసలు గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించే కార్యక్రమాలు పక్కకు నెట్టబడుతున్నాయి.నకిలీ సంఘాలు నిర్వహించే పోటీల్లో గెలిచిన సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రభుత్వ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లు లేదా అధికారిక క్రీడా రికార్డుల్లో చాలా సందర్భాల్లో చెల్లుబాటు కావు. దీనివల్ల క్రీడాకారులు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది.కాబట్టి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏదైనా క్రీడా కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఆ సంఘం గుర్తింపు, అనుబంధం, అధికారిక హోదా వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా క్రీడా శాఖ అధికారులు కూడా ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.క్రీడాకారుల భవిష్యత్తు కోసం నకిలీ క్రీడా సంఘాలను గుర్తించడం, వాటి పట్ల అప్రమత్తంగా ఉండడం ప్రతి నాయకుడి బాధ్యత. అవగాహనతో తీసుకునే నిర్ణయాలే క్రీడారంగాన్ని సరైన దిశలో నడిపిస్తాయి.