Shooter jaspal rana passed away

0
2

భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన విశిష్ట కోచ్ శ్రీ జస్పాల్ రాణా మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

▪️ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో జస్పాల్ రాణా సాధించిన విశిష్ట విజయాలు, అలాగే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం దేశానికి ఎనలేని గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పిస్టల్ విభాగంలో భారత అత్యున్నత ప్రతిభ కనబరిచిన కోచ్‌గా ఆయన యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో, దేశ షూటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

▪️“జస్పాల్ రాణా మరణంతో భారతదేశం ఒక గొప్ప క్రీడాకారుడిని మాత్రమే కాకుండా, తన ప్రతిభ, క్రమశిక్షణ, క్రీడాసేవతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే ఓ మార్గదర్శకుడిని కోల్పోయింది” అని ముఖ్యమంత్రి అన్నారు.

▪️ఈ విషాద సమయంలో జస్పాల్ రాణా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శిష్యులు, క్రీడా రంగానికి చెందిన వారందరికీ ముఖ్యమంత్రి తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.