పుంగనూరు: పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి: ఎం వి ఐ

0
0

పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సులపై తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం రికార్డులు, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.

ఫైర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టం, అలారం తప్పనిసరిగా ఉండాలని, లేని పక్షంలో అనుమతి ఇవ్వబోమని తెలిపారు. బస్సులకు పాఠశాల పేరు, ఫోన్ నంబర్లు నాలుగు వైపులా కనిపించాలని, డ్రైవర్ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలని ఆదేశించారు# కొత్తూరు మురళి .