మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. 2004లో నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లికి చెందిన దేవరాజ్‌తో వివాహం జరిగిందని, పెళ్లైన నాలుగు రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
తన భర్త బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు పేర్కొంటూ వరకట్న వేధింపుల కేసును పోలీసులు మూసివేశారని ఆరోపించిన చంద్రకళ, తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.










