మాలేపాడులో దారి సమస్య.. రహదారి దిగ్బంధం |

0
0

మదనపల్లి మండలం మాలేపాడులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ కారణంగా, బుధవారం 13 పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు, ముళ్లకంపలు వేసి రాకపోకలను స్తంభింపజేశారు.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి ఈ రోడ్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.