మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. రైతులు 1,440 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తరలించారు. నాణ్యమైన మొదటి రకం 10 కిలోల పెట్టె రూ. 340 (కిలో రూ. 34)కు అమ్ముడైంది.
రెండో రకం పెట్టె రూ. 320, మూడో రకం రూ. 270కు చేరింది. మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం, కార్యదర్శి జగదీశ్ ఈ వివరాలను వెల్లడించారు.










