ఎమ్మిగనూరు సర్కిల్ నందు ధర్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు విద్యా వ్యవస్థపై తీవ్ర అనుమానాలను కలిగించాయి. జాతీయ పరీక్షా సంస్థ (NTA) నిర్వహణలో జరిగిన వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర.
పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని చట్టపరంగా శిక్షించాలి.ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి . విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.విద్యను వ్యాపారంగా కాకుండా విద్యార్థుల హక్కుగా గుర్తించి, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో భారీ ఎత్తున డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతాం.ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ అనిల్ వర్మ కిరణ్ రాజు అరవింద్ వీరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.










