దేశ విభజనవాదం ప్రమాదకరం: పవన్ కల్యాణ్

0
0

ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణులు దేశ సమగ్రతకు అత్యంత ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఢిల్లీలో ‘ఏఎన్‌ఐ’ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ చేసిన అశాస్త్రీయ విభజన విధానాన్ని మాత్రమే తప్పుబట్టానని స్పష్టం చేశారు.

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ప్రాంతీయ వైషమ్యాలు పెంచడం సరికాదన్నారు. అలాగే ‘వీబీ-జీ రామ్ జీ’ (VB-G RAM G) పథకం కింద ఏపీకి రూ. 7,707.21 కోట్ల కేంద్ర నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.