జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత.

0
2

జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే అర్హత లేదు: హోంమంత్రి అనిత

వైసీపీ అధినేత జగన్ విశాఖ పర్యటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ కార్మికులను పట్టించుకోని జగన్‌కు ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నాడు స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాల కోసం వాడుకోవాలని జగన్ భావించారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వ కృషితో ప్లాంట్ 99 శాతం ఉత్పత్తి సామర్థ్యానికి చేరిందని, ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు తొలిసారిగా శాశ్వత ఉద్యోగం కల్పించే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అనిత విమర్శించారు.