కరీంనగర్‌లో ‘ఆసరా’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

0
2

కరీంనగర్ జిల్లా భారత్ అవార్డ్ న్యూస్.

కరీంనగర్ జిల్లా కు చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి రా) ఆధ్వర్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రక్తదాన శిబిరాలను ఈనెల 14 మరియు 15వ తేదీలలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపి కృష్ణ తెలిపారు.

ఈనెల 14 వ తేదీన ఆదివారం కిసాన్ నగర్ లోని శివాజీ నగర్ చౌరస్తా కరీంనగర్ డైరీ పార్లర్ ఎదురుగా రక్తదాన శిబిరం మరియు 15వ తేదీన సోమవారం మంకమ్మతోటలోని విద్మహి న్యూట్రిషన్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు గోపి కృష్ణ తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్త దానం చేయుటకు ఆసక్తిగల వారు 85209 62230, 84999 77060 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు.