బాల కార్మికుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీఈవో.

0
0

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.

ఆర్‌టీఈ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 9, 500 మంది విద్యార్థులను చేర్పించి లక్ష్యాన్ని 104 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వలస కుటుంబాల పిల్లలను బడిలో చేర్పించాలన్నారు.