మదనపల్లెలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.

0
0

మదనపల్లెలో ఆదివారం వేకువజామున జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలవపల్లెకు చెందిన మౌలాలి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రసవం కోసం తన భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన మౌలాలి.

అర్ధరాత్రి ఆమె ప్రసవించిన తర్వాత కుటుంబ సభ్యులకు కాఫీ తీసుకురావడానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో అతని కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.