రామసముద్రం మండలంలో ఆదివారం నారిగానిపల్లి పంచాయతీ పరిధిలోని ఎగువ లంబంవారిపల్లికి చెందిన రవణమ్మ (46) ఇంటి వద్ద పాడి పశువులకు గడ్డి కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చేయి గడ్డి కత్తిరించే యంత్రంలో చిక్కుకుంది.
ఈ ఘటనలో ఆమె చేతి వేళ్లు రెండుగా తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన రవణమ్మను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది










