సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు, మాజీ మంత్రి మరియు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరించిన లేఖను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు.
జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 2న అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారని తెలిపారు.
ఆగస్టు 3న సంప్రదాయబద్ధంగా రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు.
ఈ సమావేశంలో రాంగోపాల్‌పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రామ్ మోహన్ యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
#Sidhumaroju










