● సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి సంయుక్త దాడి
● నిందితుడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం
● గతంలోనూ నాలుగు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదైనట్లు వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడిలో 280 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
సూరారం ఎస్‌హెచ్‌ఓ కె. బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఖైసర్‌నగర్‌కు చెందిన ఎండీ సలీమ్ అలియాస్ గుడ్డు శర్మ (45), వాచ్‌మన్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
సలీమ్ గతంలోనూ గంజాయికి సంబంధించిన నాలుగు ఎన్‌డీపీఎస్ కేసుల్లో అరెస్టైనట్లు వెల్లడించారు.
ఈ కేసుపై దర్యాప్తు దర్యాప్తు కొనసాగుతోంది.
#sidhumaroju










