కౌన్సిలర్ లావణ్య చొరవ: పరిష్కారమైన విద్యుత్ సమస్యలు|

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లాధన్యవాదాlu  పోచంపల్లి గట్టు ఇంటి వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న కరెంట్ పోల్‌ను తొలగించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అయితే ప్రస్తుతం 5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లావణ్య శ్రీనివాస్ గారికి విషయం తెలియజేయగానే ఆమె వెంటనే స్పందించి, విద్యుత్ శాఖ AE శ్రీ దుర్శేట్టి అరవింద్ గారికి సమాచారం అందించారు. వారి చొరవతో కౌన్సిలర్ ఆధ్వర్యంలో సంబంధిత కరెంట్ పోల్‌ను తొలగించి, సురక్షితమైన దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెనుగుపల్లిలో ప్రధానంగా ఉన్న లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం రెండు 9 మీటర్ల (9MM) విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిందిగా AE గారిని కోరగా, ఆయన వెంటనే చర్యలు తీసుకొని వాటిని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించిన 5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లావణ్య శ్రీనివాస్ గారికి, విద్యుత్ శాఖ AE శ్రీ దుర్శేట్టి అరవింద్ గారికి, అలాగే విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామస్తులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.