“మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు.”|

0
6

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ సాయిబాబానగర్ కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.

కాలనీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని కోరుతూ సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

కాలనీవాసుల సమస్యలపై తక్షణమే స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్, అటు జలమండలి ఉన్నతాధికారులకు, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ప్రత్యేకంగా సిఫార్సు లేఖలు రాశారు.

కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంటూ హైదరాబాద్ జలమండలి (HMWS&SB) మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డికి ఎంపీ లేఖ రాశారు.

ముఖ్యంగా అర్జున్ Heights బిల్డింగ్ నుండి సాయిబాబా నగర్ కమాన్ మెయిన్ రోడ్ వరకు ఉన్న రోడ్ నంబర్ 1లో, అలాగే స్కేటింగ్ గ్రౌండ్ మెయిన్ రోడ్ నుండి శివ ఎన్‌క్లేవ్ వరకు ఉన్న రోడ్ నంబర్ 4 పరిధిలో నూతన భూగర్భ మురుగునీటి పైప్‌లైన్ (UGD) పనులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు.

ప్రజల ఆరోగ్యం, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని జలమండలి ఎండీని కోరారు.

మరోవైపు కాలనీలోని అంతర్గత రహదారులు చాలా కాలం క్రితం వేసినవి కావడంతో పూర్తిగా గుంతలమయంగా మారాయని, రాకపోకలకు తీవ్ర అవరోధంగా తయారయ్యాయని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

హెచ్‌ఎమ్‌టి కాలనీ రోడ్డు నుండి సాయిబాబా నగర్ కాలనీ వరకు, అలాగే రోడ్ నంబర్ 7, రోడ్ నంబర్ 9, రోడ్ నంబర్ 4 మరియు వాటి జంక్షన్ పరిసర ప్రాంతాలలో అత్యవసరంగా కొత్త సిమెంట్ కాంక్రీట్ (CC) రహదారులు నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

వీటితో పాటు స్థానిక స్కేటింగ్ పార్కులో ప్రజల సౌకర్యార్థం, భద్రత కోసం హై-మాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు.

స్థానిక ప్రజల ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ జలమండలి, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా స్పందించి ఈ నిధుల మంజూరు, పనుల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ తన లేఖల్లో డిమాండ్ చేశారు.

#Sidhumaroju

Alwal