అన్నమయ్య జిల్లా యంత్రాంగం 22-A భూ సమస్యలకు పరిష్కారం చూపింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్ల పరిధిలో 27 మంది రైతులకు చెందిన 27.31 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరిస్తామని జేసీ పేర్కొన్నారు.










