కూకట్‌పల్లి కాంగ్రెస్: ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక శిక్షణ|

0
1

 

కూకట్‌పల్లి, జూన్ 16: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారి ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR)  కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, BLAలు పాల్గొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ సతీష్ సావంత్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వజ్రేష్ యాదవ్, టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ మన్నే సతీష్, తెలంగాణ బ్రాహ్మణ సంఘం వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తూము వేణు, పటోళ్ల నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి తదితరులు హాజరై     బూత్ లెవెల్ ఏజెంట్ లకు పలు కీలక సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం, అక్రమాలను అడ్డుకోవడం, ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రజలకు అవగాహన కల్పించడం బూత్ లెవెల్ ఏజెంట్ ది ప్రధాన బాధ్యత అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ముందుంటుందని పేర్కొన్న ఆయన, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా  బూత్ లెవెల్ ఏజెంట్ లు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ లు అంకితభావంతో పనిచేయాలని, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రానున్న కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.