నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పారిశుధ్య కార్యక్రమం|

0
2

*వేములవాడ//……….* *నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం* *రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత ఆలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు సానిటేషన్ సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, ప్రధాన రహదారులు, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, మెట్లు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.* *ఆలయానికి విచ్చేసే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో చెత్తాచెదారం తొలగించడం, పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టారు.* *ఈ సందర్భంగా అధికారులు సానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.పారిశుధ్య కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు, సిబ్బంది, సానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. భక్తులకు స్వచ్ఛమైన, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు*.