పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో సోమవారం మామిడికాయల లోడ్ తో వస్తున్న వ్యాన్ టైర్ పంచర్ కావడంతో మట్లోళ్లపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే స్పందించి, రోడ్డును క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పెను ప్రమాదం తప్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.










