Bhogapuram airport inauguration|

0
1

భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

 

ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. టెర్మినల్ భవనం నిర్మాణ విశేషాలు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులు ప్రధానికి వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు.. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఈ విమానాశ్రయం అంటూ… సీఎం గారు భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను చూపించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

#NewGatewayToAP

#ModiHonoursAlluri

#UttarandhraKalalakuRekkalu

#BhogapuramAirport

#AlluriSitaramaRajuAirport

#GatewayToUttarandhra

#ChandrababuNaidu

#AndhraPradesh