మదనపల్లెలో మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.|

0
0

మంగళవారం సాయంత్రం మదనపల్లెలో షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న భార్గవి అనే మహిళ మెడలోంచి 24 గ్రాముల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగుడు లాక్కుని పరారయ్యాడు. వన్‌టౌన్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, సొసైటీ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.