బుధవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లె–కదిరి ప్రధాన రహదారిపై ఐచర్ వాహనంలో తరలిస్తున్న టమోటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. టీడీపీ యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు, రామాపురం శీను ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానికులు, వాహనదారులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. రహదారిపై పడిపోయిన టమోటాలను తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం సంతోషకరమని వారు తెలిపారు.










