ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
నేను కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది… ఎమ్మెల్యే గారు స్వయంగా నా ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాకు అందించడం జీవితంలో మరువలేను : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను పొందిన సుకన్య గారు.
తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీకి చెందిన E. సూక్యన్య గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,57,753 రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారు.
స్థానిక నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధితురాలు కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
అనంతరం సుకన్య గారు మాట్లాడుతూ కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి తమ కుటుంబసభ్యులతరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










