మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ల తర్వాత ఒక మహిళకు కీలక బాధ్యత దక్కింది. గురువారం బైగారి భారతి నాయుడు మదనపల్లె టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళలకు పార్టీ కార్యక్రమాల్లో మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని భారతి నాయుడు తెలిపారు.
పార్టీ అధినేతల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.










