కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.|

0
0

మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజంపేట పార్లమెంట్ స్థాయి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, టిడిపి మదనపల్లె యూనిట్ ఇన్‌చార్జ్ కందికట్ల జయ, టిడిపి సీనియర్ నాయకులు కట్ట లక్ష్మీనారాయణ, మల్లికార్జున పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగావకాశాల కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.