పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ|

0
0

అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆలియా చికిత్స కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎంపీ మిథున్ రెడ్డిని ఆశ్రయించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి, ఆదివారం ఆమె వైద్య చికిత్సకు అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ సేవాదళ్ అధ్యక్షుడు ఎస్. టి. ఎఫ్. సిద్ధిక్ ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి