చీరాలలో ఆటో డ్రైవర్ నిజాయితీ|

0
3

ఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని కొత్తపేటలోని BSR కాలనీ లో బస్టాండ్ వరకు వెళ్ళుటకు తన భర్తతో కలిసి ఆటో ఎక్కింది. అప్పుడు ఆమెతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉన్నది. ఆ బ్యాగ్ లో ఎనిమిది సవర్ల బంగారం మరియు 7000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈవిడ చీరాలలోనే బస్టాండ్ కి వెళ్లి అక్కడ బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయి.. తన భర్తతో కలిసి ఆటో దిగి బస్టాండ్ లోకి వెళ్ళింది. బస్టాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత తను ఆటోలో బ్యాగ్ మర్చిపోయినట్లుగా కనుక్కొని వెంటనే చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చింది.

పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ రాస్తున్న సమయంలోనే ఆటో డ్రైవర్ మొగిలి శాంత కుమార్ ఎంతో నిజాయితీతో ఆ బ్యాగ్ ను తీసుకొచ్చి స్టేషన్లో అప్పగించాడు. ఆ మహిళ తన బ్యాగ్ లో ఉన్న వస్తువులని చెక్ చేసుకుని బంగారం, డబ్బులు అన్ని సరిగా ఉన్నట్లుగానే గుర్తించింది. ఆటో డ్రైవర్ మొగిలి శ్యాంత కుమార్ యొక్క నిజాయితీకి బాధిత మహిళా మరియు ఒకటో పట్టణ పోలీస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.