ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిసిటివి (CCTV) కెమెరాలు నేరస్తుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరాలపై నిఘా ఉంచి, సంఘటనలు జరిగిన
వెంటనే స్పందిస్తూ నేరాల రేటును గణనీయంగా తగ్గించారు.
ఆధునిక సాంకేతికత కేవలం నేరాలను కనిపెట్టడానికే కాకుండా, నేరాలు జరగకుండా నిరోధించడంలో కూడా హైదరాబాద్ పోలీసులకు ఒక పటిష్టమైన ఆయుధంగా మారింది. ప్రజల భాగస్వామ్యంతో ‘సేఫ్ సిటీ’గా హైదరాబాద్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.










