మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్… తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఆయన తన వంతు కృషి చేస్తానని నవీన్ తెలిపారు.










