28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం

0
2

28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పసుపు సైనికుడు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య అసనాబాద్ గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలి అని పిలుపునిచ్చారు

ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత… ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన అందరి బాధ్యత అని చెప్పారు

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వర్ణలత అంగన్వాడి టీచర్లు అంజనీ దేవి మంద రూతు ఆశ వర్కర్ మేరమ్మ చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు