పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం|

0
0

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు

#కొత్తూరు మురళి .