వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|

0
5

“భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక.”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda అమ్మవారి దేవాలయంలో సోమవారం నిర్వహించిన వట సావిత్రి వ్రతం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వటవృక్షాన్ని పూజిస్తూ సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు.

ఈ కార్యక్రమంలో Burtongudaకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థించారు.

#Sidhumaroju

Alwal