ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీలో పదవుల కోసం వీర సైనికులు, వీర మహిళల నుంచి ప్రొఫైల్ సేకరణ కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జయ భవ్య, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన జనసేన సారథుల సమాచార సేకరణ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణ బలోపేతం, అర్హులైన కార్యకర్తల వివరాల సేకరణలో ఆమె చురుకుగా వ్యవహరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.










