వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరు ఎకరాల పొలం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 24న పత్తి పొలంలో కలుపు తీస్తున్న మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న భూమి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల కథనం ప్రకారం, గతంలో కూడా ఇదే ప్రాంతంలో బంగారం, పురాతన దేవతా విగ్రహాలు లభించాయని చెబుతున్నారు. దీంతో ఆ పొలాన్ని కౌలుకు తీసుకోవడానికి రైతులు పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో గత భూ యజమాని కుమారుడు కూడా దొరికిన బంగారంపై తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ప్రచారంతో రాత్రి వేళల్లో పరిసర గ్రామాల ప్రజలు ఆ పొలం వద్దకు చేరుకుంటున్నారు.










