ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ ధీరజ్|

0
0

మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలోనే నిర్భయంగా ఫిర్యాదులు ఇవ్వవచ్చని ఎస్పీ తెలిపారు.