మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ‘మీ వార్డులో – మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా సోమవారం 32, 34 వార్డుల్లో పర్యటించారు. స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సమీప చెరువుల నుంచి నీటిని సరఫరా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అనంతరం బోర్లు వేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.










