వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్ & ఆర్ పరిహారం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూ.300 కోట్లు విడుదల చేశారు. ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో సీఎం చిత్రపటానికి యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, మహిళలు మరియు స్థానికులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, జులై-ఆగస్టు నెలల్లో మరో రూ.600 కోట్లు విడుదల చేసి మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తామని తెలిపారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించి వారి కలను సాకారం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










