22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు ఊరట.|

0
0

అన్నమయ్య జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు సోమవారం పరిష్కారం లభించింది. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మదనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్లకు చెందిన 9 మంది రైతులకు చెందిన 29.26 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించి, వారికి సంబంధించిన పత్రాలను అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించి, రైతులకు పారదర్శకమైన సేవలు అందిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.