కరెంట్ షాక్ బాధితుడికి అండగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.|

0
0

మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్‌లో కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి వైద్య సహాయం, దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, వైద్య సహాయం అందించడంతో పాటు అర్హత మేరకు దివ్యాంగ పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.